తీగనూ లాగరేం?

  • ఎమ్మార్‌ వ్యవహారంలో తొలగని అనుమానాలు
  • విజి'లెన్స్‌' బుట్టదాఖలేనా ?
  • మొదలు కాని ఎసిబి దర్యాప్తు
  • అదృశ్యశక్తే కారణామా ?
సంచలనం సృష్టించిన ఎమ్మార్‌ వ్యవహారంలో అసలు దోషులు తప్పించుకున్నట్లేనా? వేలకోట్ల రూపాయల అక్రమ ఆర్థిక లావాదేవీలు చోటుచేసుకున్న ఈ వ్యవహారంలో నేరస్తులెవరో వెల్లడయ్యే అవకాశం లేదా? తాజా పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. తీగలాగితే డొంక కదులుతుందంటారు. ఎమ్మార్‌ వ్యవహారంలో డొంకను కదిలించే సంగతి ఎలా ఉన్నప్పటికీ, కనీసం తీగను లాగడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రభుత్వాన్ని తెరవెనుక నుండి నడిపించే 'అదృశ్యశక్తి' జోక్యమే దీనికి కారణమని సమాచారం. పెద్దల ప్రమేయం బాహాటంగానే ఉండటంతో ఈ

'మైక్రో'కు నాబార్డు అండ

  • రీఫైనాన్స్‌పై వడ్డీ తగ్గింపు
  • విరివిగా బ్యాంకు రుణాలు
  • సూకë సంస్థలకు 9 శాతం.. డ్వాక్రా గ్రూపులకు 12 %
చిన్న అవసరానికి అప్పు తీసుకున్న పేదలను జీవితాంతం రుణ గ్రస్తులుగా మారుస్తున్న మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డు) అండగా నిలిచింది. సూక్ష్మ సంస్థలను ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం మూలంగానే నాబార్డు మైక్రోలకు 'సాయం' చేసింది. ప్రభుత్వ రంగంలోని జాతీయ బ్యాంకులకు రీఫైనాన్స్‌

కట్టలు తెగిన కమ్యూనిస్టు ద్వేషం

- తెలకపల్లి రవి
మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ లండన్‌లో చేసిన ప్రసంగాన్ని వక్రంగా నివేదించడమే గాక దాని ఆధారంగా రెచ్చిపోయి విషం కక్కడంలో కొన్ని పత్రికలు,మీడియా సంస్థలు పోటీ పడ్డాయి. అవగాహన చేసుకోవడానికి అరక్షణమైనా యత్నించకుండా అవహేళన చేయడానికి అధ్వాన వ్యాఖ్యలతో అల్పానందం ప్రదర్శించడానికి మహా విజ్ఞులైన సదరు సంపాదకీయ రచయితలు చూపించిన ఆరాటం అన్యులకు అసాధ్యమైన పని!
కరత్‌ ప్రసంగంలోని కీలకమైన రెండు అంశాలను మళ్లీ చెప్పుకుంటే- భారత దేశంలో సిద్ధాంత పరంగానూ ఆచరణ రీత్యానూ వర్గ వ్యవస్థ అనేక దొంతరలతో ప్రభావితమై కలగలసిపోయి వ్యత్యాసాలతో వివక్షతలు అణచివేతలతో

మీకు తెలిసిన చరిత్రేమిటి కామ్రేడ్‌?

- తమ్మినేని వీరభద్రం 
ప్రకాశ్‌కరత్‌ లాంటి జాతీయ నాయకుడిపై వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ముందూ,వెనకా చూసుకోవాలి. కేంబ్రిడ్జిలో తాను (కరత్‌) చేసిన ప్రసంగాన్ని మీడియా తప్పుగా రిపోర్టు చేసిన విషయం తెలియగానే ఆయన ఖండన విడుదల చేశారు. తాను చెప్పిందేమిటో అందులో ఆయన స్పష్టంగా వివరించారు. అయినా అదేమీ పట్టించుకోకుండా పట్టాభి రామారావు ఆయనపై కత్తులు దూయటం విజ్ఞత అనిపించుకోదు.

‘‘మైక్రో దారుణాలు’’ - 06

మైక్రో మరణాలు-ప్రభుత్వ వైఫల్యాలు

-కె.స్వరూపారాణి
మైక్రో ఫైనాన్స్‌ సంస్థల అకృత్యాలకు గత పక్షం రోజులలో రాష్ట్రంలో ముఫైమంది దాకా బలవన్మరణం చెందారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వారం కిస్తీ కట్టలేదని బకాయి కింద 10 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేశారు. అదే జిల్లా పూసలవారి పాలెంలో తల్లి రుణం చెల్లించలేకపోవటంతో కూతురును పడుపు వృత్తిలోకి దించమని సూక్ష్మరుణ సంస్థలు ఒత్తిడి తేవటంతో 16 సంవత్సరాల వెంకట లకిë కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లాలో వారం

‘‘మైక్రో దారుణాలు’’ - 05

మైక్రో ఫైనాన్స్‌ల మాయాజాలం - ప్రపంచీకరణ

- సిహెచ్‌.నరసింగరావు
ప్రభుత్వం మైక్రో సంస్థల గురించి నంగనాచి కబుర్లు చెబుతున్నది. సూక్ష్మ రుణ సంస్థలను నియంత్రించేందుకు ఆర్డినెన్స్‌ తెచ్చానంటోంది. ఆ ఆర్డినెన్సులోని ప్రధాన లోపం పేదల నుంచి ఇబ్బడిముబ్బడిగా వడ్డీలు వసూలు చేయడంపై పూర్తిగా మౌనం వహించడం. కీలకమైన ఈ అంశంపై ఆర్డినెన్స్‌లో ఎక్కడా ఒక్క ముక్క కూడా ప్రస్తావించలేదు. ఒకవైపు పావలా వడ్డీ గురించి ప్రచారం చేసుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం బ్యాంకు వడ్డీలే వసూలు

‘‘మైక్రో దారుణాలు’’ - 04

 దొంగ చేతికి తాళాలా!
మైక్రోఫైనాన్స్‌ కార్యకాలాపాలపై నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేసే యోచన ప్రస్తుతం లేదని, వడ్డీ రేటుపై ఆ సంస్థలే స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ వాకృచ్చడం దొంగ చేతికి తాళం ఇవ్వడంలా వుంది. మైక్రోఫైనాన్స్‌ సంస్థలు(ఎంఎఫ్‌ఐ) వసూలు చేయాల్సిన వడ్డీ రేటును నియంత్రించే అధికారం తమకు లేదు కాబట్టి కేంద్రమే ఒక ఆర్డినెన్స్‌ తీసుకొస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి వట్టి వసంతకుమార్‌ సోమవారం,

‘‘మైక్రో దారుణాలు’’ - 03

 మైక్రో దా'రుణాలు'
'మైక్రో మ'రుణాలు ', 'మైక్రోభూతానికి మరో ఇద్దరు బలి', 'రుణం ఒక వల.. మరణం దాని వెల'... ఇవీ గత కొన్ని రోజులుగా పత్రికల్లో వస్తున్న ప్రధాన శీర్షికలు. రాష్ట్రంలో సూక్ష్మ రుణ సంస్థల దుర్మార్గాలకు ఇవి కేవలం కొన్ని మచ్చుతునకలు మాత్రమే.ఇంకా వెలుగుచూడని దా'రుణాలెన్నో'! పేదరికం ఆసరాగా అధికలాభాలు పిండుకునే రాక్షసులెలా వుంటారో రాష్ట్రంలో సాగుతున్న మైక్రో ఫైనాన్స్‌ సంస్థల దారుణాలు తెలియజేస్తున్నాయి. అపారమైన

‘‘మైక్రో దారుణాలు’’ - 02

మైక్రో అప్పు పేదలకు ముప్పు
ప్రతి మహిళనూ లక్షాధికారిణిని చేస్తామంటూ తియ్యతియ్యటి కబుర్లెన్నో చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్‌పార్టీ. తమ పొదుపు పథకాల పుణ్యమా అని కోటిమందికిపైగా మహిళలు లక్షాధికారులయ్యారని, మహిళా సాధికారత దిశగా పయనిస్తున్నామని గత ప్రభుత్వమూ ఊదరగొట్టింది. వాస్తవం మాత్రం దానికి భిన్నంగా వుంది. పావలా వడ్డీకి రుణాలు, రివాల్వింగ్‌ ఫండ్‌ మాట 'దేవుడె'రుగు! సూక్ష్మ రుణ సంస్థల ఊబిలోపడి ఊపిరాడని

‘‘మైక్రో దారుణాలు’’ - 01

మానవ మారణహోమం సాగిస్తున్న మైక్రో ఫైనాన్స్‌
- సారంపల్లి మల్లారెడ్డి
మాసం రోజులలో 45 మందిని ఆత్మహత్యలకు గురిచేసిన మైక్రో ఫైనాన్స్‌ రుణాలు స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి)కు ప్రమాదకరంగా పరిణమించాయి. ఈ రోజు రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు రూ.15వేలకోట్ల రుణాలిచ్చాయి. ఈ రుణవసూళ్ళ చర్యలు అత్యంత దుర్భరంగానూ, భయంకరంగానూ ఉన్నాయి. కిడ్నాపులు, అవమానాలు, వేధింపులు లాంటి చర్యలు రుణ వసూళ్ల సందర్భంగా మైక్రో ఫైనాన్స్‌ సిబ్బంది అవలంభించడం

జాతి అమూల్య సంపద మన యువత

అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలలో భారత్‌ ఒకటి. మన దేశంలో 13 నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న వారు 45.9 కోట్లమంది ఉన్నారు. అంటే, దేశ జనాభాలో వీరు 37.9 శాతంగా ఉన్నారు. 2003నాటి జాతీయ యువజన విధానాన్ని అనుసరించి ఈ వయస్కులందరూ యువజనులుగా లెక్కకు వస్తారు. ఈ యువశక్తిని సక్రమంగా వినియోగించు కోగలిగితే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది.

సంక్షోభంలో ఉన్నత విద్యారంగం

విద్యావేత్తలతోగానీ, రాష్ట్రాలతోగానీ ఈ విషయమై చర్చించటానికి కూడా కేంద్రం సుముఖంగా లేదు. పలు రంగాలలో అమెరికాతో వ్యూహాత్మక పొత్తు పెట్టుకున్న యుపిఏ ప్రభుత్వం విద్యారంగంలో సైతం అమెరికా, ఇంగ్లండు తదితర ధనిక దేశాల ఒత్తిళ్ళకు తలొగ్గుతున్నది. తమతమ దేశాలలోని ఉన్నత విద్యారంగం సంక్షోభంలో చిక్కుకోవటంతో ధనిక దేశాలు బయటి దేశాలవైపు దృష్టి సారించాయి. ఉన్నత విద్యారంగానికి సంబంధించి అమెరికా, ఇంగ్లండు దేశాలతో ఇప్పటికే భారత ప్రధాన మంత్రి, మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. భారత-అమెరికా విద్యా మండలిని ఏర్పాటు చేయాలని గత ఏడాదే నిర్ణయించారు.