సోషలిస్టు పరిధిలోనే క్యూబా సంస్కరణలు

- ఆస్కార్‌ మార్టినెజ్
పెట్టుబడిదారీ విధానానికి మేము తలుపులు తెరవడం లేదు. అందుకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వం. మా ఆర్థిక సంస్కరణలు సోషలిస్టు సూత్రాల ప్రాతిపదికన చేపడుతున్నవే. మేము చాలా కాలం నుంచి స్వయం ఉపాధి కార్మికులను కలిగివున్నాము. ఇప్పుడు వారి సంఖ్యను పెంచడం మాత్రమే జరుగుతోంది. స్వయం ఉపాధి కార్మికులు కొన్ని సందర్భాల్లో ఎక్కువ సంపాదించవచ్చు. అయితే అది ఎక్కువ శ్రమించడం ద్వారానే జరుగుతుంది తప్ప ఇతరుల శ్రమను దోచుకోవడం ద్వారా మాత్రం జరగదు.

'అణు' ప్రమాదం ముంగిట ప్రపంచం: క్యూబా విప్లవనేత ఫైడల్‌ కాస్ట్రో

  • అమెరికా సంప్రదాయ యుద్దంలో గెలవలేదు
ప్రపంచం యావత్తూ ఇప్పుడు అణు యుద్ధ ప్రమాదం ముంగిట్లో ఉందని క్యూబా విప్లవ యోధుడు, ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఫైడల్‌ కాస్ట్రో ఆందోళన వ్యక్తం చేశారు. మాంట్రియల్‌లోని సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ గ్లోబలైజేషన్‌ ప్రతినిధి చోస్‌డోవిస్కీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అణు యుద్ధ ప్రమాదం సహా ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధం కావడం, సంప్రదాయ యుద్ధంలో గెలవలేని అమెరికా, దాని మిత్ర దేశాలు అణ్వాయుధాలను సమకూర్చుకోవడం వంటి పలు అంశాలను ప్రస్తావించారు. అణు నిరాయుధీకరణ పేరిట ప్రపంచ దేశాల వద్ద అణ్వాయుధాలు లేకుండా తమ వద్దే ఉండేలా అమెరికా పన్నుతున్న కుట్ర ప్రపంచాన్ని అణు యుద్ధం ముంగిట్లోకి తీసుకెళ్తోందన్నారు. ఈ

అమెరికాలో తలెత్తుతున్న పచ్చి మితవాదం

- ఆర్‌. అరుణ్‌ కుమార్‌
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనటంలో ఒబామాతోపాటు ఆయన పార్టీకి చెందిన డెమొక్రాట్లు గందరగోళంలో పడ్డారు. సంక్షోభం నుంచి ముందుగా తమను బయట పడవేయాలని, తమకు లాభాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పాలక వర్గాలు కోరుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం కొన్ని సామాజిక సంక్షేమ చర్యలను చేపట్టటాన్ని ఈ వర్గాలు వ్యతిరేకించాయి. సంక్షోభ సమయంలో ప్రభుత్వం

ఆర్థిక, సామాజిక విధాన అభివృద్ధి ప్రాజెక్టుపై సదస్సు

క్యూబా కమ్యూనిస్టు పార్టీ, విప్లవ ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రాజెక్టుపై ఈ నెల 10 వ తేదీ నుండి నాలుగురోజుపాటు జరిగిన తొలి జాతీయ సెమినార్‌లో అధ్యక్షుడు రావుల్‌ కేస్ట్రో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సెమినార్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసే సమాలోచనల ఆధారంగా రూపొందించే ముసాయిదా పత్రంపై పార్టీ దిగువస్థాయి కార్యకర్తలు, దేశంలోని అన్ని వర్గాల వారితో

మానవీయుడే

 -శాంతిశ్రీ
మావో అంగరక్షకుడు లీ చెప్పిన విషయాల్ని అతను చెపుతున్నట్లుగానే రచయిత క్వాన్‌యాంచి చేసిన ప్రయోగం ావీaశీ ్గవసశీఅస్త్ర వీaఅ, చీశ్‌ీ +శీస్ణ పుస్తకానికి జీవం పోసినట్లైంది. దీన్ని తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో, దృశ్యాలు చెదరకుండా మనకందించిన అనువాదకులు కె.సత్యరంజన్‌ అభినందనీయులు. మావో గురించిన సత్యాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారందరికీ ఈ పుస్తకం సంతృప్తిని కలిగిస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన మహనీయుల

అమెరికా వ్యూహంలో పావుగా మారిన భారత్‌

 - సీతారాం ఏచూరి

ఒబామా పర్యటన అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనను బట్టి, 'నిత్య హరిత విప్లవం' ద్వారా ఆహార భద్రతను పెంపొందించే పేరుతో భారతీయ మార్కెట్లోకి అమెరికన్‌ వ్యవసాయోత్పత్తులకు ప్రవేశం కల్పించనున్నారనేది అర్థమవుతున్నది. ఇప్పటికే, తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న భారతీయ వ్యవసాయ రంగం దీనితో 'మరణ శయ్య''పైకి చేరే

ఒబామా పర్యటన వాణిజ్యమే వాస్తవం

- గుడిపూడి విజయరావు

తాను భారత్‌ చేరుకోవడానికి కొద్ది సమయం ముందే 1000 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని వాటి ఫలితంగా అమెరికాలో 50,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని ముంబయిలో అమెరికా ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ నుద్దేశించి చేసిన ప్రసంగంలో ఒబామా ప్రకటించాడు. బోయింగ్‌ సంస్థ నుండి 33 737తరహా విమానాల కొనుగోలుకు స్పైస్‌జెట్‌తో ఒప్పందం కుదిరిందని, భారత్‌ సైన్యానికి అవసరమైన

కొట్నీస్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాం

  • భారత్‌లో చైనా రాయబారి ఝంగ్‌ యాన్‌ పిలుపు
  • ఉమ్మడి కృషి ద్వారా ఉన్నత శిఖరాలు చేరాలి
అత్యున్నత మానవతా విలువలు కలిగిన మహా మనిషి, నిస్వార్థంగా సేవలందించిన వైద్యుడు డాక్టర్‌ ద్వారకానాథ్‌ కొట్నీస్‌ స్ఫూర్తితో భారత్‌-చైనా దేశాలు, ప్రజలు మరింత ముం దుకు సాగాలని భారత్‌లో చైనా రాయబారి ఝంగ్‌ యాన్‌ పిలుపునిచ్చారు. భారత్‌-చైనా దేశాధినేతల శ్రద్ధ,

షరతులు అంగీకరించరాదు : భద్రతా మండలిలో సభ్యత్వంపై ఏచూరి

  • అమెరికాది ఒక్కో దేశానికీ ఒక్కో నీతి
  • పార్లమెంటులో 'మైక్రో ఫైనాన్స్‌'పై ప్రస్తావన
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత ప్రభుత్వం ఒబామా నిర్ధేశించిన షరతులకు అంగీకరించరాదని సిపిఎం రాజ్యసభ నేత సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. అమెరికా దయాదాక్షిణ్యాల ద్వారా భారతదేశం ఎన్నటికీ సూపర్‌ పవర్‌ కాలేదని స్పష్టం చేశారు. పార్టీ లోక్‌సభ నేత వాసుదేవ ఆచార్యతో కలిసి మంగళవారం ఆయన

ఒబామా పర్యటన

సోమవారంతో ముగిసిన మూడు రోజుల ఒబామా భారత పర్యటన వ్యూహాత్మక పొత్తు అనే చట్రంలో భారత్‌ను మరింతగా బంధించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఒబామా తన పదిరోజుల ఆసియా పర్యటనలో తొలి మజిలీగా ప్రపంచంలో చైనా తరువాత అతిపెద్ద మార్కెట్‌ను కలిగివున్న భారత్‌ను ఎంచుకోవడానికి కారణం ఇదే. ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు, పార్లమెంటులో ఒబామా చేసిన ప్రసంగం, అంతకు ముందు విడుదల జేసిన

వాస్తవాలు కప్పిపుచ్చి సుద్దులు చెప్పిన ఒబామా

అమెరికాలోని పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకే ఆ దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌లో పర్యటించారని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. అణ్వాయుధాలను నిరోధించటం, మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటం తదితర విషయాల్లో తమ దేశం చేస్తున్న తపుల్ని కప్పిపుచ్చి, వాస్తవాలను మరుగుపరిచిన ఒబామా మన దేశానికి, ప్రజలకు సుద్దులు చెప్పటం విడ్డూరంగా ఉందని

ఒబామా పర్యటనపై పెల్లుబికిన నిరసన

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దేశ పర్యటనను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌నరసింగరావు, ఎంఎ గఫూర్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఒబామా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వ్యవసాయం, విద్య, చిల్లర

అమెరికా ప్రయోజనాలే ఎజెండా : యుఎస్‌ అధ్యక్షుని పర్యటనపై సిపిఎం పొలిట్‌బ్యూరో

ఒబామా భారత పర్యటన అమెరికా ప్రయోజనాలే ప్రధాన అజెండాగా సాగినట్లు సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఒబామా నాలుగు రోజుల పర్యటన ఫలితాలపై ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒబామా పర్యటన అమెరికాతో వ్యూహాత్మక పొత్తును మరింత పటిష్టపరిచింది. భారతీయ మార్కెట్లను అమెరికా వ్యాపార, వాణిజ్య ప్రయోజనాల కోసం తెరవడం, భారత్‌ను మరింతగా భద్రత, సైనిక బంధం దిశగా నడిపేందుకు అది చేసిన యత్నాలను పర్యటన ముగింపులో విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన

అటు ఒబామా ప్రసంగం...ఇటు నిరసనల హోరు

  • వెలువెత్తిన సామ్రాజ్యావాద వ్యతిరేకత
పార్లమెంటులో సోమవారం ఒక వైపు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రసంగిస్తుండగానే, మరోపక్క వామపక్షాల పిలుపు మేరకు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లక్షలాది మంది దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కోల్‌కతా నడిబొడ్డున ఉన్న లెనిన్‌ విగ్రహం నుంచి యుఎస్‌ఐఎస్‌ కూడలి వరకు భారీ ప్రదర్శన జరిగింది.

ఒత్తిళ్లకు లొంగొద్దు

  • స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలి
  • ఆండర్సన్‌ను భారత్‌కు అప్పగించాలి
  • అమెరికా పెత్తందారీ విధానాలపై హోరెత్తిన లెఫ్ట్‌ నిరసన
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌లో పర్యటిస్తున్న ప్రస్తుత సమయంలో ఆ దేశ పెత్తందారీ విధానాలను నిరసిస్తూ వామపక్షాలు సోమవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. సిపిఎం, సిపిఐ, ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌, తదితర వామపక్షాలకు చెందిన కార్యకర్తలు దేశవ్యాప్తంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొని అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలని కేంద్రంలోని

మరో ఐరోపా వ్యాపిత ఆందోళనకు సన్నద్ధం

అమెరికా నుంచి ఐరోపాకు పాకిన సంక్షోభం కారణంగా ఇప్పటికే 50లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి. రానున్న కొద్ది సంవత్సరాలలో ప్రత్యక్షంగా ప్రభుత్వ రంగంలో మరో పది లక్షల ఉద్యోగాలు ఊడబోతున్నాయి. ఈ పరిణామం పర్యవసానంగా పరోక్షంగా కనీసం మరో 15-20లక్షల ఉద్యోగాలు పోతాయని అంచనా. ఈ పరిణామాల ప్రతికూల ఫలితాల కారణంగా పోయే ఉద్యోగాలు వీటికి అదనం. వచ్చే ఏడాది జర్మనీలో 2-5శాతం మధ్య ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కోతపడనున్నాయి.

ఏ ఉగ్రవాదంపై యుద్ధమో చెప్తారా ఒబామాగారూ!

- సునీత్‌ చోప్రా

ముంబయి పేలుళ్లకు కారకులైనవారిని శిక్షించాల్సిందేనని ఒబామా చెప్పారు. కానీ, తన దేశంలోనే ఉన్న హెడ్లీని భారత్‌కు అప్పగించే విషయంలో మౌనం వహించారు. హెడ్లీ, అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్న పాకిస్తాన్‌ జాతీయుడు. హెడ్లీని భారత్‌కు అప్పగించడానికి ససేమిరా అన్నారు. కనీసం మన విచారణ అధికారులు అతన్ని నేరుగా విచారించేందుకు కూడా అవకాశమివ్వలేదు. ఇప్పుడు ఉగ్రవాదంపై యుద్ధంలో భారత్‌ తనతో కలసి రావాలని కోరుతున్నారు.

భారత్‌ ఆర్డర్లతో అమెరికాలో 50 వేలు కాదు 7 లక్షల ఉద్యోగాలు

అమెరికా నుండి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పరికరాలు, న్యూక్లియర్‌ హార్డువేర్‌, మిలటరీ ఎయిర్‌క్రాఫ్టులను భారత్‌ కొనుగోలు చేయడం వలన రానున్న 10 సంవత్సరాల కాలంలో అమెరికాలో ఏడు లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లవుతుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలిపింది. ఇప్పుడు భారత్‌ వ్యాపారం కేవలం ఐటి, ఐటిఇఎస్‌లతోనే కాదని మరిన్ని రంగాలలో విస్తృతంగా వుండనున్నదని అమెరికాలో

అక్టోబర్‌ మహావిప్లవం-ప్రస్తుతదశలో దాని విశిష్టత

- వి.శ్రీనివాసరావు
  • నేడు 93వ అక్టోబర్‌ మహా విప్లవ వార్షికోత్సవం
సోవియట్‌యూనియన్‌ కూలిపోయినా అక్టోబర్‌ విప్లవం విఫలం కాలేదు. దాని స్పూర్తితో రాజ్యాధికారంలోకి వచ్చిన చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తరకొరియా, లావోస్‌ తదితర దేశాల్లో సోషలిజం వేళ్లూనుకుంది. అమెరికాకు ఆమడదూరంలో ఉన్న క్యూబా సోవియట్‌ కన్నా బలహీన దేశం అయినప్పటికీ సామ్రాజ్యవాదాన్ని సవాలు చేసి నిలదొక్కుంది. అది నిలబడటమే కాదు నేడు లాటిన్‌ అమెరికాలో అనేక దేశాలకు మార్గదర్శిగా, స్పూర్తిప్రదాతగా కూడా ఉంది. వెనిజులాతో ఆరంభమైన వామపక్షజ్వాల అనేక దేశాలకు విస్తరిస్తోంది. మన పక్కనే ఉన్న నేపాల్‌లో కమ్యూనిస్టులు ప్రధాన శక్తిగా ఉన్నారు.

ఒబామా పర్యటనలో వాణిజ్య ఎజెండా

- గుడిపూడి విజయరావు
సాధారణంగా ఏ దేశాధినేత అయినా భారత పర్యటనకు వచ్చినప్పుడు దేశ రాజధాని ఢిల్లీని మొదట సందర్శించడం ఆనవాయితీ. అమెరికా అధ్యక్షుడు ఒబామా మాత్రం తన పర్యటనలో తొలి మజిలీగా ముంబయిని ఎంచుకున్నాడు. వాణిజ్యం ఒబామా ఎజెండాలో ఒక అతి ముఖ్యమైన అంశంగా ఉండబోతున్నదనడానికి ఇదొక సంకేతం. వాణిజ్యంలో కూడా లక్షల కోట్ల రూపాయలతో కూడిన రక్షణ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన ఒప్పందాలకు ఆయన అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. రానున్న అయిదేళ్లలో రక్షణ కొనుగోళ్ల కోసం భారత్‌ రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించనున్న తరుణంలో దాంట్లో సింహ భాగం దక్కించుకోవడానికి అమెరికా ఆయుధ వ్యాపార లాబీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఒబామా పర్యటనను ఇందుకు ఒక సోపానంగా మార్చుకోవాలని అది చూస్తున్నది.

హత్యలకు, దాడులకు వెరవని మన్యం మార్క్సిస్టు ఉద్యమం

- బండారు రవికుమార్‌
అది 1985వ సంవత్సరం సెప్టెంబర్‌ నెల. సి.పి.ఎం. ఖమ్మం జిల్లా మహాసభలు వైరాలో జరుగుతున్నాయి. ఆ మహా సభలో భద్రాచలం డివిజన్‌ సి.పి.ఎం. నాయకులు బండారు చందర్రావు అన్న మాటలు ఆ సభలో పాల్గొన్న ప్రతినిధులకు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి. ''భద్రాచలం డివిజన్‌లో నరహంతక నగ్జలైట్ల దాడులు, బెదిరింపుల మధ్య పనిచేయాల్సిన పరిస్థితి. నక్సలైట్ల బెదిరింపులకు భయపడి ఎత్తిన జెండాను దించేదిలేదు. నన్ను, అలాగే మన

పెంటగాన్‌ చేతికి మన రక్షణ వ్యవస్థ

  • కీలక రహస్య పత్రాన్ని బయటపెట్టిన ఆంగ్ల టీవి ఛానెల్‌
  • ఒబామా పర్యటన ప్రారంభంలోనే వివాద ప్రకంపనలు
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారతదేశంలో అడుగు పెట్టిపెట్టక ముందే కలకలం రేగింది. భారత రక్షణ వ్యవస్థను కబళించేందుకు అమెరికా పన్నిన పన్నాగం బట్టబయలైంది. ఒక జాతీయ ఆంగ్ల ఛానెల్‌ చేతికి ఇందుకు సంబంధించిన కీలక పత్రాలు దొరికాయి. భారత రక్షణ వ్యవస్థపై అమెరికా డేగకన్ను బట్టబయలైన తీరు రక్షణ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అమెరికా రూపొందించిన ఈ డీల్‌ భారత ప్రభుత్వ ఆమోదం పొందితే మన రక్షణ వ్యవస్థ

గోబ్యాక్‌ ఒబామా

  • వామపక్ష కార్యకర్తల నిరసన

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రాకను నిరసిస్తూ వామపక్ష కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నాయకత్వం వహించాయి. వామపక్ష కార్యకర్తలను అడ్డుకునేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. దక్షిణ ముంబయిలోని చర్చ్‌గేట్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో నిరసనకారులు గుమిగూడారు. 'గోబ్యాక్‌ ఒబామా' అని రాసున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఒబామాకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మన్మోహన్‌సింగ్‌ స్పృహలోకి రావాలని, అమెరికా సామ్రాజ్య వాదాన్ని ప్రతిఘటించాలని నినాదాలు చేశారు.

మీ దేశమే మా దుకాణం

  • అందుకే సుంకాలు, అడ్డంకులు తొలగించాలి
  • ఒబామా ప్రకటన
  • 44 వేల కోట్ల డాలర్ల వాణిజ్య 'బంధం'
భారత్‌ తమకు భవిష్యత్‌ మార్కెట్‌ అని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చెప్పారు. ఇక్కడ సుంకాలు, ఇతర అడ్డంకులను తొలగిస్తే పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తమ దేశంలో 50 వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించేందుకు వీలుగా భారత్‌ను 44 వేల కోట్ల డాలర్ల విలువైన వాణిజ్య

ఒబామా బృందం ఆశిస్తున్న ఒప్పందాలు

వ్యవసాయం : వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్‌ రంగాల్లో అమెరికా అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు భారతదేశం ముందుకు రావాలి. ఈ మేరకు అమెరికా సంస్థలకు తగు అవకాశాలివ్వాలి. జన్యు మార్పిడి (జిఎం) పత్తి విత్తనాలను ఇప్పటికే మోన్‌శాంటో అందిస్తోంది. ఇదే తరహాలో కార్గిల్‌, మెక్‌ డొనాల్ట్స్‌, హింజ్‌, తదితర సంస్థలకు విస్తృత అవకాశాలివ్వాలి. రైతుల నుంచి నేరుగా వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్‌ సంస్థకు

'ప్రపంచ పోలీసు' పెత్తనాన్ని మానుకోవాలి

- ప్రకాశ్‌ కరత్‌
అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఈ వారంలో భారత్‌ పర్యటనకు రానున్నారు. గతసారి అంటే 2006లో భారత్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌ సందర్శించినపుడు దేశంలో పెద్దయెత్తున నిరసనలు వెల్లువెత్తాయి. బుష్‌ పర్యటనకు అంతగా వ్యతిరేకత వ్యక్తం కావడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాక్‌పై జరిపిన యుద్ధం, దురాక్రమణే. ఆ పర్యటనకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత ఒబామా

వ్యూహాత్మక భాగస్వామ్యం కోసమే

  • భద్రాతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వానికి కట్టుబడిలేము
  • భారత్‌ పర్యటనపై ఒబామా
భారత్‌తో నిజమైన వ్యూహాత్మక భాగస్వా మ్యాన్ని నిర్మించడం తన విదేశాంగ విధాన అత్యున్నత ప్రాధాన్యాల్లో ఒకటని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలిపారు. వివిధ అంశాలపై భారత్‌-అమెరికా సహకారాన్ని విస్తృత స్థాయిలో నూతన తీరాలకు తీసుకు వెళ్లేందుకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని తనకు ఈ పర్యటన

‘‘మైక్రో దారుణాలు’’ - 08

'మైక్రో'దారుణాలు - నయా ఉదారవాద దిశను మళ్లిస్తేనే ఫలితం

-గుడిపూడి విజయరావు
మైక్రోఫైనాన్స్‌ సంస్థల నుండి రుణాలు తీసుకొని వాటిని తీర్చలేక, ఆ సంస్థల వేధింపులు, అవమానాలు భరించలేక డజన్ల సంఖ్యలో పేదలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితిని నేడు మనం చూస్తున్నాం. ఈ సంస్థలను నియంత్రించాలని, వాటి అదుపు లేని దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రతి ఒక్కరూ డిమాండ్‌ చేస్తున్నారు. మైక్రో రుణాలు ఇంతగా పెరగడానికి మూల కారణం ఏమిటి, ఈ సంస్థలు ఇంత విస్తృతంగా ఎలా వ్యాప్తి చెందాయి అన్న అంశాల్ని

‘‘మైక్రో దారుణాలు’’ - 07

మైక్రో ఫైనాన్స్‌ విస్తరణ-తీరు

-కెఎల్‌పి
భారతదేశంలో మైక్రో ఫైనాన్స్‌ విస్తరించిన తీరు
1991 సరళీకరణ విధానాల అమలుతో జాతీయ బ్యాంకుల ప్రాధాన్యత కుంచించబడింది. సామాజిక రంగానికి ప్రాధాన్యత తగ్గి, లాభాల రేటు ప్రాధాన్యత పెరిగింది. నరసింహన్‌ కమిటి సిఫార్సులు, బేసెల్‌ కమిటి ప్రమాణాలతో వ్యవసాయరంగానికి ఇచ్చే ప్రాధాన్యతా రుణాలు నిరర్ధక ఆస్తులు(పారు బాకీలు)గా భావించబడి వాటి మంజూరు

విక్టర్‌ కీర్నన్‌-భారతదేశంలో వామపక్షాలు

ప్రకాశ్‌ కరత్‌ అక్టోబరు 22వ తేదీన కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో విక్టర్‌ కీర్నన్‌ గౌరవార్థం ఏర్పాటు చేసిన సదస్సులో చేసిన ప్రసంగం పూర్తి పాఠం

'మైక్రో'లే బ్యాంక్‌ ఏజెంట్లు!

  • అకౌంట్లు, డిపాజిట్ల సేకరణ
  • 'రుణం' తీర్చుకొంటున్న బ్యాంకులు
  • పేదలు నిలువు దోపిడీ
కొన్ని జాతీయ, ప్రైవేట్‌ బ్యాంకులకు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు ఏజెంట్లుగా మారాయి. కుగ్రామాల నుండి కొత్త అకౌంట్లను, డిపాజిట్లను సేకరించి భారీగా కమీషన్లు పొందుతున్నాయి. దానికి ప్రతిఫలంగా బ్యాంకులు మైక్రోలకు భారీగా రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. మైక్రోలు పేదలకు అప్పులిచ్చి నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ప్రతి ఒక్కరినీ బ్యాంకుల పరిధిలోకి తీసుకొచ్చి అందరికీ బ్యాంక్‌ అకౌంట్లు ఇవ్వాలని కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్‌ రెండు మూడేళ్ల నుండి ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రతి గ్రామానికీ బ్యాంకులు సర్వీస్‌ ఇవ్వలేవంటూ ఆర్‌బిఐ వ్యాపార నిబంధనలను