సోషలిస్టు పరిధిలోనే క్యూబా సంస్కరణలు
పెట్టుబడిదారీ విధానానికి మేము తలుపులు తెరవడం లేదు. అందుకు ఎలాంటి ఆస్కారమూ ఇవ్వం. మా ఆర్థిక సంస్కరణలు సోషలిస్టు సూత్రాల ప్రాతిపదికన చేపడుతున్నవే. మేము చాలా కాలం నుంచి స్వయం ఉపాధి కార్మికులను కలిగివున్నాము. ఇప్పుడు వారి సంఖ్యను పెంచడం మాత్రమే జరుగుతోంది. స్వయం ఉపాధి కార్మికులు కొన్ని సందర్భాల్లో ఎక్కువ సంపాదించవచ్చు. అయితే అది ఎక్కువ శ్రమించడం ద్వారానే జరుగుతుంది తప్ప ఇతరుల శ్రమను దోచుకోవడం ద్వారా మాత్రం జరగదు.
క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ ఇటీవల చేపట్టిన సంస్కరణల గురించి ఆ పార్టీ అంతర్జాతీయ సంబంధాల విభాగం ఉప అధిపతి ఆస్కార్ మార్టినెజ్ దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ పత్రిక 'ఉమ్సెబెంజి' సంపాదకులు యూనస్ కరీమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సవివరంగా వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం ...
సోషలిజానిదే భవిష్యత్తు!
దానిని ఇప్పుడు నిర్మిద్దాం!!
క్యూబా నేడు ఎటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నది?
మేము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలతోబాటు అమెరికా ఆర్థిక, ద్రవ్యపరమైన దిగ్బంధనం మా ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా దెబ్బతీస్తున్నది. 48 ఏళ్లుగా మా సాంఘిక, ఆర్థికాభివృద్ధికి ఉన్న అతి పెద్ద అడ్డంకి కూడా ఈ దిగ్బంధనమే. సోవియట్ యూనియన్, సోషలిస్టు బ్లాక్ పతనం అయ్యాక మేము మా ప్రధాన వాణిజ్య భాగస్వాములను కోల్పోయాము. ఇది చాలా తీవ్రమైన నష్టం కలిగించింది. దీని నుంచి మేము ఇప్పటికీ కోలుకోలేకపోయాము. దీనికి తోడు 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కూడా మమ్మల్ని తీవ్రంగా దెబ్బతీసింది. మేము అధికంగా ఎగుమతి చేసే నికెల్ ధరలు పడిపోయాయి. హరికేన్ల వల్ల సంభవించిన నష్టం అంతా ఇంతా కాదు. ఆర్థికాభివృద్ధి సాధించేందుకు మా సామర్ధ్యాన్ని మరింత పెంచుకోవడం, పొదుపు పెంపొందించుకోవడం చాలా అవసరం. మా దేశంలో వనరులు పరిమితం. ఉత్పత్తిని పెంచుకోవడం, క్రమశిక్షణను పెంపొందించుకోవడం, మా ఆర్థిక నమూనాను తాజాపరచుకోవడం ఇప్పుడు మా ముందున్న కర్తవ్యాలు. మేము దిగుమతులపై అందునా మరీ ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నాము. దీంట్లో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయంపై కేంద్రీకరణను మరింత పెంచాలి. ఆహార ఉత్పత్తి అనేది ఇప్పుడు జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా తయారవుతున్నది.
అమెరికా ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేయాలేదా?
ఆచరణే గీటురాయిగా పెట్టుకుని చూసినప్పుడు దిగ్బంధనం ఎత్తేయలేదనే చెప్పాలి. దిగ్బంధనంలోని ముఖ్యమైన అంశాలు ఇప్పటికీ అలానే వున్నాయి. మొత్తంగా చూసినప్పుడు ఇది మరింత దారుణంగా తయారైంది. క్యూబాతో వ్యాపార లావాదేవీలు నిర్వహించే కంపెనీలపై 2009 నుంచి మరిన్ని నిషేధాలు విధించారు. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ఈఆర్థిక దిగ్బంధనానికి వ్యతిరేకంగా 187 దేశాలు ఓటు చేశాయి. 1962లో ఈ దిగ్బంధనం మొదలైనప్పటి నుంచి 2009 డిసెంబరు దాకా క్యూబా ఆర్థిక వ్యవస్థను ఇది నేరుగా దెబ్బతీసింది. మామూలు అంచనా ప్రకారమే ఈ నష్టం సుమారు 1540 కోట్ల అమెరికన్ డాలర్లు. నేటి డాలర్ విలువ ఆధారంగా లెక్కకడితే ఇది 2,390 కోట్ల డాలర్లు .
ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి అయిదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఎలా రిట్రెంచ్ చేస్తారు. అందునా సోషలిస్టు రాజ్యంలో ఇలా చేయవచ్చా?
మేము ఎవరినీ రిట్రెంచ్ చేయలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ అలా చేస్తుంది. మేము మా ప్రజలకు సామాజిక భద్రత కల్పించకుండా వీధినపడేసే పని ఎన్నటికీ చేయము. కార్మికులను తొలగించం. వారిని ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాల్లో ముఖ్యంగా ఆహార ఉత్పత్తికి సంబంధించిన రంగంలో పని చేయమని చెబుతాము. ఇవీ తాజాపరచిన మా ఆర్థిక నమూనాలో తీసుకొచ్చిన మార్పులు. మా సోషలిస్టు వ్యవస్థను ఇవి బలోపేతం గావిస్తాయి. కార్మిక శక్తిని సహేతుకంగా, మరింత సమర్థవంతంగా వినియోగించడం ద్వారా మా సోషలిస్టు వ్యవస్థను సుస్థిరపరచుకుంటాము. మొదటి విడత మార్పులు 2011 తొలి త్రైమాసికాంతానికల్లా పూర్తి చేస్తాము. ఈ ప్రక్రియలో భాగంగా ప్రజలకు భూములు ఇస్తాము. వాటిని ఉపయోగించి ఉత్పత్తిని పెంచేలా చూసేందుకు వారికి తోడ్పాటునందిస్తాము. పట్టణాలకు సమీపాన ఉన్న ప్రాంతాలలో ఇటువంటి భూములు ఎక్కువగా వున్నాయి. కార్మికులు, శ్రామికుల్లో 80 శాతం దాకా వుంటున్నది అక్కడే కాబట్టి ఈ భూములను ఆహార ఉత్పత్తికి వినియోగిస్తారు. ఇవి పట్టణాలకు దగ్గరలో వుండడం వల్ల ఇంధన, రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. మాకు బ్యూరోక్రాట్లు, వృత్తి నిపుణులు చాలా మంది వున్నారు. వృత్తిదారులే తగినంతగా లేరు. ఆర్థిక రంగానికి సంబంధించిన పత్రాలను రూపొందించే పని నుంచి వారిని ఇతర రంగాలకు మళ్లించాలనుకుంటున్నాము. ఆర్థిక వ్యవస్థకు వారు ఎలా తోడ్పడతారు. ఉత్పాదకతలోవారిని ఎలా భాగస్వాములను చేయాలి అనేదాని గురించి ఆలోచిస్తున్నాము. వారికి పని కల్పించేందుకు కొత్త రంగాలను వెతికే ప్రయత్నంలో వున్నాము. అధ్యక్షుడు రావుల్ కాస్ట్రో మాట్లాడుతూ '' పనిచేయకపోయినా నీవు జీవించగలిగే స్థితి ప్రపంచంలో ఎక్కడైనా వుందీ అంటే అది క్యూబాలోనే అన్న దుష్ప్రచారాన్ని దీంతో మేము పటాపంచలు చేశాము'' అన్నారు. వారు పనిచేయడానికి వీలుగా మేము కొత్తగా 178 రంగాలను తెరిచాము.
కార్మికుల పునర్ నైపుణ్యానికి మీరు శిక్షణ ఇస్తారా? ఏయే రంగాలను తెరుస్తున్నారు?
కార్మికులు నూతన నైపుణ్యాన్ని పొందేందుకు, ఇతరత్రా రాణించేందుకు మేము పూర్తి తోడ్పాటునందిస్తాము. మా ఉన్నత విద్యా సంస్థలు కూడా ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తాయి. రుణాల మంజూరులో బ్యాంకులు తోడ్పాటునిస్తాయి. దిగుమతులను తగ్గించి ఆహార ఉత్పత్తిని పెంచుకోవడమే మా అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యతగా వుంటుంది. ఆహార దిగుమతులు తగ్గించినా కొన్ని రంగాల్లో దిగుమతులను మేము పెంచుకోవాలనుకుంటున్నాము. మేము తెరిచే నూతన రంగాలలో ముఖ్యమైనవి టూరిజం, వాణిజ్యం, సేవల రంగాలు. రవాణా వాహన సప్లయి, ఇటుకల తయారీ, భవన నిర్మాణ కార్మికులు, వడ్రంగి పనివారలు, ఎలక్ట్రీషియన్స్, వాయిద్యకారులు, బూట్ల తయారీదారులు, మరమ్మతుదారులు, క్షురకులు, అకౌంటెంట్లు తదితర వృత్తులలో మరింత మంది స్వయం ఉపాధి పొందేందుకు అనుమతిస్తాము. అంతేకాదు, రెస్టారెంట్లను వారు నిర్వహించుకునేందుకు కూడా మేము అనుమతిస్తాము. అయితే ఆ రెస్టారెంట్లలో ఇరవై సీట్లకు మించి ఉండరాదు. అందులో సంబంధిత రెస్టారెంటు యజమాని కుటుంబ సభ్యులు తప్పనిసరిగా పనిచేయాలి. వారికి తోడుగా ఇంకొద్దిమందిని పనికి పెట్టుకోవచ్చు.
రెస్టారెంట్లలో పనిచేసేవారికి కనీస వేతనాలు, రెస్టారెంట్ యజమానుల లాభాలపై పరిమితి లాంటి నిబంధనలను ఏమైనా పెట్టారా?
అవును, కనీస వేతనాలు తప్పకుండా ఇవ్వాల్సి వుంటుంది. ఇవి చాలా చిన్నవి గనుక పెద్దయెత్తున లాభాలు సంపాదించే అవకాశమే వుండదు. మేము నూతన పన్నుల పునః పంపిణీ విధానాన్ని ప్రవేశపెడుతున్నాము. ఇందుకు సంబంధించి నూతన నియంత్రణలు, పన్నుల విధాన సవరణ వంటివి తెచ్చాము. ఇప్పటికే వీటిని ప్రభుత్వ గెజిట్ ప్రత్యేక సంచికలో ప్రచురించాము.
అంతిమంగా మీరు ప్రైవేట్ సంస్థలను ప్రవేశపెట్టేందుకు తదుపరి చర్యలు ప్రవేశపెడుతున్నారని భావించవచ్చా?

ప్రయివేటు రంగంతో ఉమ్మడి సంస్థల ఏర్పాటు, 1990ల ప్రారంభం నుంచి చేపట్టిన ఇతర ఆర్థిక సంస్కరణలు క్రమంగా సోషలిజం నుంచి క్యూబా జారిపోవడానికి దారితీయదా?
అలా జరగదు. ఈ నూతన సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల్లో మేము సోషలిజాన్ని పటిష్టపరచుకుంటున్నాము. ప్రయివేటు రంగాన్ని మేము ఏమీ విస్తరించడం లేదు. మౌలికమైన ఉత్పత్తి విధానం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. భూమి దున్ని పంట పండించేవాడికే ఆ ఫలసాయం దక్కుతుంది. కానీ, ఆ భూమిపై యాజమాన్య హక్కు మాత్రం ప్రభుత్వానికే వుంటుంది. మేము భూములను ఏమీ ప్రయివేటీకరించడం లేదు. భూమిని ఉత్పాదకతకు వినియోగించని వారి నుంచి లీజు అగ్రిమెంటు ప్రకారం తిరిగి వెనక్కి తీసుకుని మరొకరికి కేటాయిస్తాము. మా అల్ప ఉత్పాదకతతో సోషలిజాన్ని నిర్మించాలన్న కృతనిశ్చయాన్ని నెరవేర్చుకోవడం అసాధ్యం. మేము దృఢమైన ఆర్థిక వ్యవస్థ కలిగివుండాలి. విద్య, వైద్యం ఉచితంగా అందించే కార్యక్రమం సాఫీగా సాగాలన్నా బలమైన ఆర్థిక వ్యవస్థ వుండాలి. మేము మా దేశ పరిస్థితులకనుగుణంగా మా సొంత పద్ధతుల్లో సోషలిజాన్ని నిర్మించుకుంటున్నామనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. మేము దీనిని విప్లవం ద్వారా సాధించుకున్నామే తప్ప ఎక్కడి నుంచీ ఎరువు తెచ్చుకోలేదు. మా దేశ చరిత్ర, మా సంస్కృతి, క్యూబన్ యోధుల కృషి, క్యూబన్ ప్రజల అభీష్టం, మా సహజ వనరులు, మా వాతావరణం, చిన్ని దీవిగా మా స్థానం, కరీబియన్‌లో మా ఉనికి, ఇప్పుడు మాకు ఎదురవుతున్న నిర్దిష్ట సమస్యలు అన్నిటిని గమనంలో వుంచుకునే ఈ ప్రక్రియ రూపొందించాము. ఈ విషయంలో మేము అంత సమర్థులం కాకపోవచ్చు, కానీ, సోషలిజం నిర్మాణానికి మా సర్వశక్తులూ ఒడ్డుతాం. అమెరికా ఆర్థిక దిగ్బంధనం, ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో సోషలిజాన్ని కాపాడుకునేందుకు మేము ఈ మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మార్పులను క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ నియంత్రణ కింద, క్యూబన్ ప్రజల మద్దతుతోనే మేము చేపట్టాము. విప్లవం సాధించిన 51 ఏళ్ల తరువాత, ఇప్పుడు పెద్ద వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడే స్థితిలో మేము ఎంతమాత్రమూ లేము.
1990ల ప్రారంభం నుంచి అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణల వల్ల క్యూబన్ సమాజంలో ఆర్థిక అసమానతలు పెరగలేదా? ఈ సంస్కరణల వల్ల విలువల్లో మార్పు రాలేదా? మరి అవినీతి మాటేమిటి?
అవును, అసమానతలు ఉన్నాయి. ఈ అంతరాన్ని పెరగకుండా నివారించడంపై మేము దృష్టి పెట్టాము. అయితే ఈ పరిస్థితి తలెత్తడానికి అమెరికా, ఇతర దేశాలలో క్యూబన్లు తమ బంధువులకు పంపిస్తున్న డాలర్లు కూడా ఒక ముఖ్య కారణమని చెప్పాలి. ఉదా: ఒక అమెరికన్ డాలర్ మా ప్రజలకు మేము ఇచ్చే రేషన్ కార్డుతో సమానం. బయట నుంచి ఈ విధంగాడబ్బు పొందేవారు ఇతరుల కన్నా మెరుగైన స్థితిలో వున్నారు. సోవియట్ యూనియన్ పతనానంతరం ప్రవేశపెట్టిన ఈ ద్వంద్వ కరెన్సీ విధానాన్ని కొంత కాలం తరువాత ఎత్తివేయాలనుకుంటున్నాము. (క్యూబన్లు క్యూబన్ కరెన్సీ పెసోను వాడతారు. అమెరికన్ డాలర్‌తో పోల్చితే పెసో చాలా బలహీనంగా వుంది. అయితే అమెరికన్ డాలర్లను పెసోలలోకి మార్చేటప్పుడు అది అమెరికన్ డాలర్ విలువకు దగ్గరగా వుంటుంది.) అయితే ఇది చేయాలన్నా మా శ్రామిక శక్తి ఉత్పాదకతను పెంచుకోవాలి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం గావించాల్సిన అవసరముంది. అలాగే ప్రజల విలువల్లో కూడా ఇవి మార్పులు తెస్తాయనే విషయం మాకు తెలుసు. దీనిని గమనంలో వుంచుకునే మా స్కూళ్లలోను, యంగ్ కమ్యూనిస్టు లీగ్‌లలోను, ప్రజా సంఘాలలోను, పని ప్రదేశాలలోను, ఇతర చోట్ల సైద్ధాంతికపరమైన కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాము. ఈ అంశంపై బహిరంగ చర్చలను నిర్వహిస్తున్నాము. ఇందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అవినీతి పట్ల కరకుగా వ్యవహరిస్తున్నాము. అవినీతి నిరోధక చర్యలు, లంచం తీసుకున్నవారిని ప్రాసిక్యూట్ చేయడం వంటి చర్యలు తీసుకున్నాము. ఏదైనా మార్పు చేపట్టినప్పుడు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతుంటాయి. మా ఆర్థిక సంస్కరణలు క్రమంగా ఈ అవలక్షణాలను తొలగించుకుంటూ పురోగమిస్తున్నాయి. మేము సంస్కరణలను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాదు. కాబట్టి వీటి పర్యవసానాల గురించి కూడా మాకు ఒక అవగాహన ఉంది. సాధ్యమైనంతవరకు ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాకుండా చూస్తున్నాము.
మీ నూతన ఆర్థిక సంస్కరణల పట్ల కార్మికుల స్పందన ఏ విధంగావుంది?
మేము కార్మిక సంఘాలతోను, కార్మికులతోను విస్తృతంగానే చర్చలు, సంప్రదింపులు సాగించాము. మా సమస్యలగురించి చర్చించుకున్నాము. వాటిని ప్రజల ముందుంచాము. వాటిని మేము ఎలా పరిష్కరించగలమో చెప్పాము. ప్రతిదీ అరమరికలు లేకుండా ప్రజలతో మేము పంచుకుంటున్నాము. వారు మాకు మద్దతు ఇస్తున్నారు. సోవియట్ యూనియన్, సోషలిస్టు బ్లాక్ కూలిపోయిన తరువాత ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజల నుంచి మాకు అనేక విలువైన ఆలోచనలు, సూచనలు అందాయి. వాటిని మా ప్రణాళికల్లో పొందుపరిచాము. కార్మికులు మాత్రం ఆందోళన చెందారు. రాజ్యం తమకు అవసరమైన ప్రతిదీ సమకూర్చుతుందన్నదీంతో వారు అప్పటివరకు వున్నారు. రాజ్యంపై ఎక్కువగా ఆధారపడుతుండేవారు. ఇప్పుడు వారు ఈ ప్రక్రియకు అనుగుణంగా సర్దుకున్నారు. ఇది అంత తేలిక కాదు. అయినా నేడున్న పరిస్థితుల్లో ఇది చేయక తప్పదు. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం భాగస్వామిగా వుంటుంది. మేము కార్మికులను పట్టించుకోకపోవడమనే ప్రశ్నే ఉండదు. నూతన పనిలో నిలదొక్కుకునేందుకు వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలను మేము అందిస్తాము. మేము ఈ మార్పులు చేపట్టింది భావి తరాలవారికి మనం భారంగా పరిణమించరాదన్న ఉద్దేశంతోనే. మేము ఇప్పుడు చేస్తున్నదంతా మా కోసం (క్యూబన్ల కోసం), మరీ ముఖ్యంగా మా పిల్లల కోసమే.

Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment