ఆర్థిక, సామాజిక విధాన అభివృద్ధి ప్రాజెక్టుపై సదస్సు

క్యూబా కమ్యూనిస్టు పార్టీ, విప్లవ ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రాజెక్టుపై ఈ నెల 10 వ తేదీ నుండి నాలుగురోజుపాటు జరిగిన తొలి జాతీయ సెమినార్‌లో అధ్యక్షుడు రావుల్‌ కేస్ట్రో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సెమినార్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసే సమాలోచనల ఆధారంగా రూపొందించే ముసాయిదా పత్రంపై పార్టీ దిగువస్థాయి కార్యకర్తలు, దేశంలోని అన్ని వర్గాల వారితో విస్తృత చర్చ జరుపనున్నామని చెప్పారు.కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని నికోలోపెజ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ స్కూల్‌లో జరిగిన ఈ సెమినార్‌లో దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, విస్తరించిన అభివృద్ధి విధాన పత్రం ముసాయిదాలను మంత్రివర్గ ఉపాధ్యక్షుడు మారినో మురిల్లో జార్జ్‌ ప్రవేశపెట్టారు. ఈ సదస్సులో ఇంకా పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ, ప్రభుత్వ ఉపాధ్యక్షులు, మంత్రులు, పార్టీ కార్యకర్తలు, యువ కమ్యూనిస్టుల సంఘం (యుజెసి), ఇతర ప్రజాసంఘాలు, హోం, విప్లవ సాయుధ దళాలకు చెందిన మంత్రిత్వశాఖలు, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ అధ్యయన కేంద్రాలకు చెందిన ప్రొఫెసర్లతో పాటు ఆర్థికవేత్తలు, గణకుల జాతీయ సంఘం (ఎఎన్‌ఇసి) సభ్యులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

 

0 comments: